నింగి అంచులను తాకిచూడాలని
నీలోని నిరాశా నిస్పృహలు
ఎగసిపడుతున్నంత కాలం
నీలో చింతచావలేదనీ
పులుపు రుచి ఇంకా సలుపుతూనే
వున్నదని అవగాహన చేసుకో.
కాలంతోపాటు అమిత వేగంగా నీ కోరికలు
గుర్రాలపై స్వారీ చేయాలని
తహతహలాడుతున్నంత సమయమూ
నీకు తీపిమీద మోజు తీరలేదని
అర్ధంచేసుకోవాలని హెచ్చరిక మాత్రమే
అదని సుతారమూ గ్రహించడమే మేలు.
సముద్రాన్ని సమీపించగానే దాన్ని
గజీతగాడిలా లంఘించి స్వాధీనం చేసుకోవాలని
నీలో జఠరాగ్ని జ్వలిస్తున్నంత కాలం
అహంకారానికే నీవు దాసోహమనుకుంటూ
చరిస్తున్నావని మాత్రం గ్రహించి మసలుకో.
నీలోని నిరాశా నిస్పృహలు
ఎగసిపడుతున్నంత కాలం
నీలో చింతచావలేదనీ
పులుపు రుచి ఇంకా సలుపుతూనే
వున్నదని అవగాహన చేసుకో.
కాలంతోపాటు అమిత వేగంగా నీ కోరికలు
గుర్రాలపై స్వారీ చేయాలని
తహతహలాడుతున్నంత సమయమూ
నీకు తీపిమీద మోజు తీరలేదని
అర్ధంచేసుకోవాలని హెచ్చరిక మాత్రమే
అదని సుతారమూ గ్రహించడమే మేలు.
సముద్రాన్ని సమీపించగానే దాన్ని
గజీతగాడిలా లంఘించి స్వాధీనం చేసుకోవాలని
నీలో జఠరాగ్ని జ్వలిస్తున్నంత కాలం
అహంకారానికే నీవు దాసోహమనుకుంటూ
చరిస్తున్నావని మాత్రం గ్రహించి మసలుకో.
-------------------
No comments:
Post a Comment